టైటిల్ రేపే..

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా గతంలో విజేత అనే సినిమా రాగా.. ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా.. దీపావళి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్‌ని సినిమా యూనిట్ ప్రకటించనుంది ఈ సినిమాకి ‘అశ్వథ్థామ’ఫేమ్‌ రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.

kalyandev

‘కల్కి’ సినిమాకి స్టోరీ అందించిన దేశరాజ్‌ సాయితేజ ఈ సినిమాకు కథ, కథనం అందిస్తున్నారు. ‘ఛలో, భీష్మ’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి సాగర్‌ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు.

కాగా ప్రస్తుతం ‘సూపర్ మిర్చి’ అనే సినిమాలో కూడా కల్యాణ్ దేవ్ నటిస్తుండగా.. అతడు నటిస్తున్న మూడో సినిమా ఇది.