దీపావళికి ‘ఆదిపురుష్’ నుంచి షాకింగ్ అప్డేట్

దీపావళి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా యూనిట్ నుంచి రేపు ఒక ఆసక్తికర అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఇందులో సీత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని రేపు వెల్లడించే అవకాశముంది. దీపికా పదుకొణే, కీర్తి సురేశ్, కియారా అద్వానీ పేర్లు ప్రముఖంగా రేసులోకి వినిపించాయి. ఫైనల్‌గా సీత పాత్రకు ఎవరిని ఎంపిక చేశారనేది రేపు ప్రకటించే అవకాశముంది.

ADIPURUSH

ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. పౌరాణిక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా దీనిని బాలీవుడ్ డైరెక్టర్ ఔం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్‌లో ప్రభాస్ బిజీగా ఉండగా.. ఇది పూర్తైన తర్వాత ఆదిపురుష్ సినిమా ప్రారంభం కానుంది.

ఆదిపురుష్ సినిమాపై ప్రభాష్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.