కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా `ఇద్ద‌రు` టీజ‌ర్ విడుద‌ల‌

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి , రాధికా కుమార‌స్వామి, కె.విశ్వ‌నాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `ఇద్ద‌రు`. ఎఫ్‌.ఎస్. ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఎస్‌.ఎస్‌.స‌మీర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫ‌రీన్ ఫాతిమా నిర్మాత‌. ఈ సినిమా టీజ‌ర్ లెజండ‌రీ డైర‌క్ట‌ర్ కె.విశ్వ‌నాథ్ చేతుల మీదుగా విడుద‌లైంది.
నిర్మాత ఫ‌రీన్ ఫాతిమా మాట్లాడుతూ “తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌ భాషల్లో భారీ స్థాయిలో తెర‌కెక్కించాం. అత్యుత్త‌మ సాంకేతిక నిపుణులంద‌రూ మా సినిమాకు ప‌నిచేశారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కెరీర్ బెస్ట్ చిత్రాలు `జెంటిల్ మేన్‌` ,`ఒకే ఒక్క‌డు` స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. హృద్య‌మైన ప్రేమ క‌థ‌, ఉత్కంఠ‌గా సాగే యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నెల్లోనే ఆడియో విడుద‌ల చేస్తాం. ఏప్రిల్‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం “ అని అన్నారు.
ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.స‌మీర్ మాట్లాడుతూ “కోట్ల ఆస్తి కోసం జ‌రిగే మైండ్ గేమ్ ప్ర‌ధానంగా ఈ చిత్రం సాగుతుంది. ప్ర‌తి ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
హైద‌రాబాద్‌, బెంగళూరు, మ‌హారాష్ట్ర‌, గోవా,థాయిలాండ్‌ లో షూటింగ్ చేశాం. ఈ నెల్లో పాట‌ల‌ను, వ‌చ్చే నెల్లో సినిమాను విడుద‌ల చేస్తాం“ అని అన్నారు.

న‌టీన‌టులు
యాక్ష‌న్ కింగ్ అర్జున్‌, రాధికా కుమార‌స్వామి, జె.డి.చ‌క్ర‌వ‌ర్తి, కె.విశ్వ‌నాథ్‌గారు, ఫైజ‌ల్ ఖాన్ (అమీర్‌ఖాన్ బ్ర‌ద‌ర్‌), అశోక్ కుమార్‌, సోనీ చ‌రిష్టా, స‌మీర్‌, రామ్‌జ‌గ‌న్‌, గ‌గ‌న్‌, సంధ్యా ఝ‌న‌క్‌, ప్ర‌శాంత్ తదిత‌రులు.
సాంకేతిక నిపుణులు
ఎడిటింగ్‌: ప్ర‌భు, కెమెరా: ఆమిర్ లాల్‌, సంగీతం: సుభాష్ ఆనంద్‌, ఆర్ట్: ర‌ఘుకుల‌క‌ర్ణి, ఫైట్స్: కికాస్ (చెన్నై), నిర్మాత‌: ఫ‌రీన్ ఫాతిమా, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.ఎస్‌.స‌మీ