ఇద్దరు మైఖేల్ జాక్సన్ లని ఒకే ఫ్రేమ్ లో చూసినట్లుంది

యుద్ధం అనేది సమఉజ్జిల మధ్యే జరగాలి, అప్పుడే ఆ యుద్దానికి ఒక అర్ధం ఉంటుంది అంటారు. బాలీవుడ్ హంక్ హ్రితిక్ రోషన్, హీమాన్ టైగర్ ష్రాఫ్ ని చూస్తే అన్ని విషయాల్లో సమఉజ్జిల్లాగే అనిపిస్తారు. అందుకే ఈ ఇద్దఋ హీరోలుగా ఒక సినిమా తెరకెక్కుతుంది అనే వార్త బయటకి రాగానే సినీ అభిమానులంతా ఇండియన్ మిషన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ఫురియస్ రేంజ్ వస్తుందని ఆశించారు. వారి అంచనాలకి తగ్గట్లే వార్ సినిమా సిద్దమయ్యింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో హై ఓల్టేజ్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ని చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించిన చిత్ర యూనిట్, జై జై శివ శంకర్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫైనెస్ట్ డాన్సర్స్ ఇద్దరు ఒకేసారి స్క్రీన్ పైన డాన్స్ చేస్తుంటే చూడగానే వావ్ ఫీలింగ్ కలిగింది. ఎప్పటిలాగే టైగర్ తన అక్రోబాటిక్ స్కిల్స్ తో మెప్పించగా, హ్రితిక్ తనకి మాత్రమే సరిపోయే గ్రెస్ తో ఆకట్టుకున్నాడు. సింపుల్ గా చెప్పాలి అంటే టైగర్, హ్రితిక్ కలిసి డాన్స్ చేస్తే ఇద్దరు మైఖేల్ జాక్సన్ లని ఒకేసారి చూసినట్లు ఉంది.