బన్నీ పాటకు స్టెప్పులేసిన ఇండిగో సిబ్బంది.. వీడియో వైరల్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సినిమాలోని పాటలు అన్ని వర్గాల ప్రేక్షకులతో స్టెప్పులు వేయించాయి. ఇక సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు దక్కిన విషయం తెలిసిందే.

క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏకంగా టిక్ టాక్ వీడియో చేసి జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల వైజాగ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా బుట్టబొమ్మ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు. హ్యాండ్ గ్లోవ్స్ ధరించిన ఎయిర్ హోస్టెస్ లు, పైలెట్లు ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ తో జనాలను ఎంతగానో అలరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.