మంత్రి “కేటీఆర్” జన్మదిన సందర్భంగా సరికొత్త రికార్డ్స్ సృష్టించనున్న ‘రక్త దాన శిబిరం’..

జులై 24న యూసుఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం సరికొత్త రికార్డ్స్ సృష్టించనుంది. ఒక రోజున అత్యదిక సంఖ్యలో దాతలు రక్తదానం ఇవ్వడంలో దేశంలోనే కొత్త రికార్డ్ కానుంది. ఈ సరికొత్త రికార్డును నమోదు చేసుకునేందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు రానున్నారు.. గత ఏడాది విశాఖపట్నంలో ఒకరోజున 862 మంది రక్తదానం చేసిన పీవీఎస్ హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఘనత ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. కాగా మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 2వేల మందికి పైగా రక్తదానం చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజున రక్తదానం చేయడం కోసం సిద్ధం కావడం అనూహ్యమైన ఘనత. కరోనా కారణంగా బయటకు రావడానికే ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున రక్తం సేకరించి తలసేమియా తదితరుల సమస్యలు ఉన్నవారికి ఇవ్వడం కోసం కృషి చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.