ఇంటర్నేషనల్ ఎమ్మీ 2020 ఈ ఏడాది నామినేషన్ల జాబితాను ప్రకటించింది. అలాగే ఉత్తమ డ్రామా, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ కామెడీ సిరీస్‌తో సహా ప్రధాన విభాగాలలో భారతదేశానికి మూడు నోమ్స్ లభించయు. ఉత్తమ నటుడిగా నామినేషన్ లో చోటు సాధించిన మేడ్ ఇన్ హెవెన్ స్టార్ అర్జున్ మాథుర్ అందరిని ఎట్రాక్ట్ చేశాడు. అలాగే షెఫాలి షా నటించిన ఢిల్లీ క్రైమ్ ఉత్తమ డ్రామా సిరీస్ విభాగంలో నామినేషన్ కి సెలెక్ట్ అయ్యింది. ఇక ప్రీతిష్ నందీ ఫెమినిస్ట్ సిరీస్ – ఫోర్ మోర్ షాట్స్ కామెడీ సిరీస్ విభాగంలో నామినేషన్ సాధించారు.
గత సంవత్సరం ప్రారంభంలో రాధికా ఆప్టే లస్ట్ స్టోరీస్ ద్వారా ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. 2020 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులకు నామినేషన్లను ఎమ్మీస్ అధికారిక వెబ్సైట్లో గురువారం ప్రకటించారు. ప్రధాన కార్యక్రమం నవంబర్ 23న జరగాల్సి ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో వేడుకకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెబుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ అకాడమీ వెబ్సైట్లో నవంబర్ 13 నుండి 23 వరకు అంతర్జాతీయ ఎమ్మీ వరల్డ్ టెలివిజన్ ఫెస్టివల్లో భాగంగా నామినేటెడ్ అయిన ట్రైలర్ మరియు ఇతర వీడియోలు ఆన్లైన్లో ప్రదర్శించబడతాయి.