SP బాలసుబ్రహ్మణ్యం హెల్త్ కండిషన్ పై సల్మాన్ హార్ట్ టచింగ్ కామెంట్!!

లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్షీణించినట్లు గురువారం సాయంత్రం వార్తలు రావడంతో సినీ లోకం ఒక్కసారిగా షాక్ కి గురైంది. అభిమానుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇక భారతదేశం అంతటా చలనచిత్ర ప్రముఖులు ఆయన్ త్వరగా కొలుకోవలని ప్రార్థిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సల్మాన్ కెరీర్ ప్రారంభ రోజుల్లో చాలా సినిమాలకు ఎస్పీబీ పాటలు పాడారు. 90ల కాలంలో మైనే ప్యార్ కియా నుండి హమ్ ఆప్కే హైన్ కౌన్ వరకు, సల్మాన్ యొక్క ప్రతి సినిమాకు బాలు తన గాత్రాన్ని అందించారు. అప్పట్లో వీరిది హిట్ కాంబినేషన్. ఇక ఆ హిట్లలో కొన్ని దిల్ దీవానా, మేరే రంగ్ మెయి రంగ్నేవాలి, దీదీ తేరా దేవర్ దీవానా మరియు పెహ్లా పెహ్లా ప్యార్ వంటి బెస్ట్ ట్యూన్స్ కూడా ఉన్నాయి. ఇక ఇటీవల SPB అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన త్వరగా కోలుకోవాలని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. మళ్ళీ బలంతో ఆయన పుంజుకొని మన మధ్యకు రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు సల్మాన్ తన సినిమాలకు పాటలు పాడినందుకు చాలా ధన్యవాదాలు అని అన్నారు. అలాగే లవ్ యూ సార్ అని కూడా పేర్కొన్నాడు.