చరిత్ర సృష్టించిన ‘అక్షయ్ కుమార్’ అడ్వెంచర్ షో!!

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఈ సారి సినిమాతో కాకుండా సూపర్ స్టార్ టెలివిజన్లో చరిత్ర సృష్టించారు. అక్షయ్, బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ షో ఇంటు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్ ఇటీవల డిస్కవరీ ఛానెల్ ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఆ షో ఇండియాలోనే ఇన్ఫోటైన్‌మెంట్ కళా ప్రక్రియ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన రెండవ టెలివిజన్ షోగా అవతరించింది.

ఈ ప్రదర్శన సోషల్ మీడియాలో కూడా భారీ సంచలనం సృష్టించింది. ఖిలాడిఆన్ డిస్కవరీ 1.31 బిలియన్ల వ్యక్తులకు చేరుకుంది. ఇక 2.9 బిలియన్ ఇంప్రెషన్స్ అందుకుంది. డిస్కవరీ నెట్‌వర్క్ ఛానెల్‌లలో దీని ప్రీమియర్‌ను సుమారు 1.1 కోట్ల మంది చూశారు. డిస్కవరీ నెట్‌వర్క్ ఛానెల్‌లలో (అసలైన + రిపీట్స్) మొదటి వారంలో దాదాపు 2.6 కోట్ల మంది ఈ ప్రదర్శనను వీక్షించినట్లు తెలుస్తోంది.