స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ కొత్త యూట్యూబ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. 65 మిలియన్ ప్లస్ వ్యూస్ నెవెర్ బిఫోర్ రికార్డు క్రియేట్ చేసిన బన్నీ, దసరాకి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్దమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది. అయితే నిన్న మొన్నటి వరకూ పుష్ప ఒక పార్ట్ గా రిలీజ్ అవుతుందా లేక టూ పార్ట్స్ గా విడుదల అవుతుందా అనే డౌట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ డౌట్ కి చెక్ పెడుతూ… నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్, పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుందని క్లారిటీ ఇచ్చేశాడు.
250-270 కోట్ల బడ్జట్ తో తెరకెక్కుతున్న ఈ కథ స్పాన్ చాలా ఎక్కువ ఉంది. ఒకటే పార్ట్ లో చూపించడం కష్టం, అందుకే మేకర్స్ ఈ మూవీని టూ పార్ట్స్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మొదటిభాగానికి క్లిఫ్ హాంగర్ గా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడట. అంటే మొదటిభాగం ఎండ్ అయ్యే టైంకి ఫాహద్ ఫాజిల్ విలన్ గా రివీల్ చేస్తారు. ఇక్కడితో ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. మంచి సర్ప్రైజ్ తో క్లోజ్ చేసి సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ వెయిట్ చేసేలా సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే దాదాపు మొదటిభాగం షూటింగ్ పూర్తవ్వగా, రెండో భాగంలోని 10% షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందట. మరి తెలుగు పర్ఫెక్ట్ సీక్వెల్ అనగానే పాన్ ఇండియాని షేక్ చేసిన బాహుబలి గుర్తొస్తుంది, మరి అదే ప్లాన్ తో వస్తున్న ఐకాన్ స్టార్ కూడా ఇండియన్ బాక్సాఫీస్ పై వసూళ్ల వర్షం కురిపిస్తాడేమో చూడాలి.