అందరినీ భయపెట్టిన హీరోయిన్ ని ఎన్టీఆర్ సెట్ చేస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ భరత్ అనే నేనుతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ. ఫస్ట్ మూవీతోనే గ్లామర్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులని మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్, ఆ తర్వాత రెండో సినిమాకే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. ఫస్ట్ మూవీలో డీసెంట్ లో కనిపించిన కియారా, సెకండ్ మూవీలో గ్లామర్ డోస్ పెంచింది. అందం అభినయం కలిసిన కియారా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపొయింది.

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా ఉంది. వినయ విధేయ రామ తర్వాత కియారా అద్వానీని తెలుగులో నటింపజేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు గట్టి ప్రయత్నాలే చేశారు కానీ అవేమి వర్క్ అవుట్ అవలేదు. కారణం డేట్స్ లేకపోవడం కాదు రెమ్యూనరేషన్. సౌత్ నుంచి ఎంత మంది ట్రై చేసినా కియారా రెమ్యూనరేషన్ చుక్కలు చూపిస్తూ ఉండడంతో అంత ఇచ్చి ఎవరూ ఆమెని కాస్ట్ చేసుకునే ధైర్యం చెయ్యట్లేదు. అయితే కియారా మూడో సినిమా మళ్లీ చేయబోతుంది. మొదటి సినిమాతోనే గ్రాండ్ డెబ్యూ ఇచ్చిన కొరటాల శివ అప్రోచ్ అవ్వడంతో కియారా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ, తన నెక్స్ట్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఫ్యాన్ ఇండియా టార్గెట్ గా వస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పక్కన కియారా అద్వానీని హిరోయిన్ గా సెలెక్ట్ చేయాలని కొరటాల భావిస్తున్నాడట. మరి డెబ్యూ డైరెక్టర్ కోసం కియారా అద్వానీ రెమ్యూనరేషన్ తగ్గించి తెలుగులో మూడో సినిమా చేస్తుందేమో చూడాలి.