351 మిలియన్ వ్యూస్… అల్లు అర్జున్ అరాచకం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా నుంచి బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్ కి కొత్త రికార్డులు నేర్పిస్తుంది. నిజానికి యూట్యూబ్ రికార్డులు బన్నీకి కొత్త కాదు, పుష్ప టీజర్ తో తెలుగులో మోస్ట్ వాచ్డ్ టీజర్ గా రికార్డ్స్ సృష్టించిన బన్నీ హిందీలో కూడా యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాడు. 2017లో అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో DJ – Duvvada Jagannadham సినిమా వచ్చింది. దిల్ రాజు నిర్మించిన సూపర్ హిట్ మూవీ హిందీలో కూడా అదే పేరుతో రిలీజ్ అయ్యింది.

2017 జూన్ 23న ఈ సినిమాని గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ వాళ్లు రిలీజ్ చేశారు. నాలుగేళ్లలో ఈ సినిమా యూట్యూబ్ లో ఏకంగా 350 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైట్స్, గ్లామర్, కామెడీ అన్నీ కలిసి ఉండడంతో హిందీ సినీ అభిమానులు దువ్వాడ జగన్నాధమ్ సినిమాకి బిగ్గెస్ట్ యూట్యూబ్ సక్సస్ ఇచ్చారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా దిల్ రాజు యూట్యూబ్ లో పోస్ట్ చేయగా, ఇక్కడ కూడా 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది.