ఈ లీకుల గోల ఏంటో… రాధే శ్యామ్ బాధ తీరేదెప్పుడో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. భారీ విజువల్స్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకింగ్ ఫొటోస్ లీక్ అయ్యాయి. ప్రభాస్, పూజ వర్షంలో కలవడం… గ్రీన్ మ్యాట్ లో ప్రభాస్ ఫేస్ కనిపించే విజువల్ లీక్ అయ్యాయి. వీఎఫ్ఎక్స్ టేబుల్ నుంచే ఈ ఫుటేజ్ లీక్ అయినట్లు ఉంది. నిజానికి రాధే శ్యామ్ నుంచి ఇలా ఫొటోస్ లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు యూరోప్ షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ లుక్స్ ని ముందుగా లీక్ ద్వారానే బయటకి వచ్చాయి. ఇది చాలదు అన్నట్లు రాధే శ్యామ్ సినిమాలో భారీ పడవ సెట్ వేశారని… దాదాపు 30 నిమిషాల పాటు జరగనున్న ఈ క్లైమాక్స్ సినిమాకే హై లైట్ అవుతుందని, టైటానిక్ మూవీని గుర్తు చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టైటానిక్ రేంజులో రాధే శ్యామ్ క్లైమాక్స్ ఉండబోతుంది అని సంతోష పడాలో లేక ఈ వార్త విని సినిమాలో చూసే ఎక్సైట్మెంట్ మిస్ అవుతున్నాం అనుకోవాలో తెలియదు కానీ కొందరి వల్ల కోట్లు పెట్టి తీస్తున్న సినిమా మాత్రం నష్టపోతుంది అన్న మాట మాత్రం నిజం.