పవన్ కళ్యాణ్ టెంప్లెట్ తో… వర్జిన్ క్వేషన్ కి దిమ్మ తిరిగే సమాధానం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్. పింక్ సినిమాని రీమేక్ చేసి, పవన్ కళ్యాణ్ కి తగ్గట్లుగా చేంజెస్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఆర్ యు వర్జిన్ అని నివేదాని అడిగితే పవన్ కళ్యాణ్ అబ్జెక్షన్ అనే సీన్ మొత్తం మోవీకే హైలైట్ అయ్యింది. ఏ సీన్ కి థియేటర్ లో అరవని అభిమాని ఉండదు. ఇప్పుడు ఇదే మ్యాజిక్ ని సోషల్ మీడియాలో రిపీట్ చేసింది సురేఖా వాణి కూతురు సుప్రీత.

సురేఖా వాణి అండ్ సుప్రీతకి ఇన్ స్టాగ్రామ్ లో మాములు ఫాలోయింగ్ లేదు. స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ ఈ తల్లి కూతుర్లకు ఉంది. దాదాపు నాలుగు లక్షల ఫాలోవర్స్ ఉన్న సుప్రీత, ఇన్స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా సుప్రీత లైవ్ సెషన్ పెట్టి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సంధర్భంగా ఒక నెటిజెన్ సుప్రీతని ఆర్ యు వర్జిన్ అంటూ అడిగేశాడు. ఈ క్వేషన్ కి కోపం తెచ్చుకోని ఏవేవో మాటలు అనకుండా సుప్రీత సింపుల్ గా ‘వకీల్ సాబ్’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ వీడియోని పోస్ట్ చేసింది. అంతే ఈ ఒక్క టెంప్లేట్ పోస్ట్ చేయడంతో, పవన్ కళ్యాణ్ ఏ కాదు అతని టెంప్లేట్ కూడా అమ్మాయికి అండగా నిలబడుతుంది అంటూ పవర్ స్టార్ అభిమానులంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఆ సీన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. Never Question a Girl about her Sexual Status. I repeat Never. Dot