Priyanka Chopra: ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి రూ.3 కోట్లు

Priyanka Chopra: ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి రూ.3 కోట్లు: గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందుకే ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఆ పాపులారిటీని క్యాష్ చేసుకుంటుంది ప్రియాంక. తన అకౌంట్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ కి సంబంధించిన పోస్ట్ పెట్టాలంటే రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందట. ఒక్క పోస్ట్ కి మూడు కోట్లు అంటే మాములు విషయం కాదు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ అకౌంట్ లో పోస్ట్ లు పెట్టడానికి రూ.8 నుండి రూ.10 లక్షలు తీసుకుంటారు.