మళ్లీ కలవనున్న హృతిక్, సైఫ్ అలీ ఖాన్

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది ఎప్పటినుంచో ఉంది. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో హిట్ అవుతుందని చెప్పలేం. ఇలా రీమేక్ అయి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తమిళంలో హిట్ అయిన ఒక సినిమా హిందీలోకి రీమేక్ కాబోతోంది. 2017లో విడుదలైన అయిన ‘విక్రమ్ వేదా’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మాధవన్ పోలీస్ పాత్రలో కనిపించగా.. విజయ్ పేతుపతి గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు.

hrithik roshan and saif ali khan

ఇప్పుడు హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైప్ అలీ ఖాన్ నటించనున్నారని సమాచారం. హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో, సైప్ అలీ ఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. ఇటీవల గ్యాంగ్‌స్టార్ పాత్రను అమీర్ ఖాన్ పోషిస్తాడని వార్తలొస్తాయి. కానీ తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి అమిర్ ఖాన్ తప్పుకున్నాడు. హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్టులోకి రావడం వల్లనే అమిర్ ఖాన్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళంలో ‘విక్రమ్ వేదా’ సినిమాను తెరకెక్కించిన పుష్కర్ గాయత్రినే హిందీ రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

ఇందులో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్‌ల కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా గ్యాంగ్‌స్టార్ పాత్రలో హృతిక్ నటన ఎలా ఉంటుందనే దానికోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడనున్నాయి.