హిందూపురం… బాలయ్య మూడోసారి సాయం

నందమూరి నట సింహం, బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి హిందూపురం ప్రజలకి అండగా నిలిచారు. కోవిడ్ భాదితులకు 10 లక్షల విలువ చేసే 1000 మెడికల్ కిట్లని బాలకృష్ణ పంపించారు.ఆ కిట్లని స్థానిక నాయకులు, హిందూపురంలోని బాలయ్య నివాసం వద్ద ప్రతి పంపిణీ చేస్తున్నారు. హిందూపురం ప్రజలకి బాలయ్య కోవిడ్ కిట్లని పంపడం ఇది మూడోసారి. సరిగ్గా వారం క్రితమే బాలకృష్ణ 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందులను కిట్లని హైదరాబాద్ నుంచి హిందూపురం పంపించాడు. నమ్మిన అభిమానులకి, ఎన్నికున్న ప్రజలకి అండగా నిలవడంతో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అని నందమూరి నట సింహం మరోసారి రుజువు చేసింది.