ముద్దులు హగ్గులు ఉన్నాయి కానీ ‘ప్రేమ కాదంట’ మాష్టారు

దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ తన పుట్టినరోజు సంధర్భంగా నెక్స్ట్ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ లుక్ ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. శిరీష్ రొమాంటిక్ జానర్ లోకి అడుగుపెట్టి చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చాయి. రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ప్రేమ కాదంట అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లీడ్ పెయిర్ కిస్సింగ్ మిర్రర్ సెల్ఫీకి టైటిల్ యాడ్ చేస్తూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రీ లుక్ నుంచి ముద్దులు, హగ్గులు చూపిస్తున్నారు కానీ ఇది ప్రేమ మాత్రం కాదంటున్నారు. అన్ని ఉండి అది ప్రేమ కాకుండా ఎలా ఉంటుంది? ప్రేమ కాకపోతే ఇద్దరి మధ్య ఉన్నది ఇంకేమయ్యి ఉంటుంది? ఇలాంటి క్వేషన్స్ అన్నింటికీ ఆన్సర్ తెలియాలి అంటే టీజరో ట్రైలరో బయటకి వచ్చే వరకూ ఆగాల్సిందే. ఈ ప్రేమ కాదంట సినిమాకి అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.