హను మ్యాన్ అయ్యే హీరో ఎవరు?

హీరో నాని నిర్మించిన ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే ప్రయోగాత్మక సినిమా చేసి మంచి దర్శకుడిగా నిలబడ్డారు. ఆ తరువాత రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, రాజశేఖర్ ని ఇలా కూడా చూపించొచ్చా అనిపించేలా చేశాడు. ఇక మూడో సినిమా కూడా ప్రయోగమే చేసిన ప్రశాంత్ వర్మ తెలుగులో మొట్టమొదటి జాంబీ జానర్ సినిమా చేశారు. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బాంబీ రెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. తేజ సజ్జాని హీరోగా కూడా నిలబెట్టింది.

ఇక నాలుగో సినిమాగా ఆయన తెలుగులో నిజమైన సూపర్ హీరో సినిమా హనుమాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. రియల్ సూపర్ హీరో అయిన హనుమాన్ మీద ప్రశాంత్ వర్మ దృష్టిపెట్టేశారు. HANU-MAN అంటూ నిన్న వదిలిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. మరి ఇందులో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది?