‘డ్రగ్స్’ కేసులో ‘బుజ్జిగాడు’ హీరోయిన్ అరెస్ట్!!

కన్నడ సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ బయటపడుతుండడం అక్కడి సినీ ప్రముఖుల్ని షాక్ కి గురి చేస్తోంది. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించగా చాలా మంది పేర్లు భయటపడినట్లు తెలుస్తోంది.

ఇక బుజ్జిగాడు హీరోయిన్ సంజనా గల్రానిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సంజనను పోలీసులు విచారిస్తున్నారు. ఆగస్ట్ లోనే ముగ్గురు పెడ్లర్స్ ని అరెస్ట్ చేసి అనికా అనే యువతి డైరీని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కేసు ఊహించని మలుపులు తిరిగింది. ఇక ఇప్పుడు నటి సంజనను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. మరి ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు బయటపడతాయో చూడాలి.