‘బిగ్ బాస్’ 4 ఎపిసోడ్ 3: ‘గంగవ్వ’ కౌంటర్లు.. ‘కళ్యాణి’ వివాదాలు!!

బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారమే గోడవలతో షోలో తెలియని హీట్ మొదలైంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియెన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గంగవ్వ కౌంటర్లు ఇతర స్టార్స్ ఓవరాక్షన్ సీన్స్ కూడా షోకి మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో హౌజ్ లో ఉండే నియమాలపై కరాటే కళ్యాణి సబ్యులకు వివరణ ఇచ్చింది.

ఒక స్కూల్ టీచర్ ని అంటూ గంగవ్వ 50ఏళ్లుగా ఇదే స్కూల్ లో ఉందని కామెంట్స్ చేశారు. దీంతో గంగవ్వ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. జీతం తీసుకుంటున్నావ్ అందరిని ఫెయిల్ చేస్తున్నావ్ అని కౌంటర్ ఇచ్చారు. ఇక మెయిన్ గా హౌజ్ లో కట్టప్ప కాన్సెప్ట్ ఎక్కువగా ఆకట్టుకుంది. ఇంట్లో వెన్నుపోటు పొడిచే కట్టప్ప ఎవరై ఉంటారని బిగ్ బాస్ ఇచ్చిన పజిల్ కి అందరూ కూడా అఖిల్ ని నామినేట్ చేశారు. ఇక అభిజిత్ తో కరాటే కళ్యాణి గొడవలకు దిగింది. మొదటి రోజే ఇతర యాంకర్స్ తో వివాదాలకు దిగిన కళ్యాణి యువ హీరోతో కూడా గొడవ పడడంతో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి.