‘మెగా’ హీరో సినిమా కోసం రెమ్యునరేషన్ తగ్గించిన ‘రకుల్’?

టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా హీరోలకు సరిపడే కొత్త హీరోయిన్స్ దొరకడం లేదు. ఇక సీనియర్ హీరోయిన్స్ కూడా కొంత వరకు అపజయలతో సతమతమవుతున్నారు. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దొరకడం కష్టంగా మారింది.

అయితే ఎలాగైనా సరే చిన్న సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలని ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ గట్టిగానే కష్టపడుతోంది. పైగా రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తోంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ సినిమా బడ్జెట్ తక్కువ కావడంతో రెమ్యునరేషన్ కోటి కంటే తక్కువగానే తీసుకుంటోందట. ఇంతకుముందు ఈ బ్యూటీ కోటికి పైగానే తీసుకునేదట. ఇక సక్సెస్ కొట్టి పూజా హెగ్డే, రష్మీక వంటి హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో ఆఫర్స్ అందుకోవాలని డిసైడ్ అయ్యిందట. మరి రకుల్ ఆ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.