మహేశ్, నితిన్, బన్నీల తర్వాత నాగ చైతన్య ఆ లిస్ట్ లో చేరాడు

ప్రస్తుతం సూపర్ మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ భామ రష్మిక, తెలుగులో టాప్ లీగ్ హీరోయిన్ గా నిలబడడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదు. విజయ్ తోనే రెండు సినిమాల్లో నటించి… నితిన్ అండ్ బన్నీల నెక్స్ట్ మూవీస్ లో కూడా కనిపించడానికి రెడీ అయిన రష్మిక, తన నెక్స్ట్ సినిమాని అక్కినేని హీరోతో చేయబోతోంది. నాగ చైతన్య హీరోగా, శశి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతూ ఒక సినిమా రాబోతోంది. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

naga chaitanya

త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమా గురించి, ఇప్పటి వరకూ ఎలాంటి వార్త బయటకి రాలేదు కానీ రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న జెమినీ తమ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ మూవీ అనౌన్స్ చేసింది. డైరెక్టర్ నుంచి కానీ, హీరో హీరోయిన్, ప్రొడక్షన్ హౌజ్ నుంచి కాకుండా శాటిలైట్ ఛానల్ నుంచి సినిమా అనౌన్స్ కావడం ఇదే మొదటి సారి. రష్మిక, నాగ చైతన్యల సినిమాకి ‘అదే నీవు అదే నేను’ టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. టైటిల్ చాలా పొయిటిక్ గా ఉంది, రష్మిక-చైతన్యల కాంబినేషన్ కూడా ఆన్ స్క్రీన్ ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఈ మూవీ గురించి ఫైనల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకి వస్తుందా అని అక్కినేని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.