సినీ తరాల సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఇది ఉదాహరణ మాత్రమే

నార్త్ లోని మహరాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు జరుగుతున్నాయి. సినిమా వాళ్లు అంటే సొసైటీని పట్టించుకోరు అనే మాట గతంలో చాలా ఎక్కువగా వింపించేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. సమాజంలో జరిగే ప్రతి విషయంపై స్పందిస్తూ సెలెబ్రిటీస్ తమ రెస్పాన్సిబిటిని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలే అందుకు ప్రధాన ఉదాహరణగా నిలుస్తున్నాయి. చాలా పక్కా ప్రణాళికతో ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల్లో బాలీవుడ్ తారలు క్యూలో నిలబడి ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

bollywood stars

బాలివుడ్ అందాల నటి మాధురి దీక్షిత్, ప్రీతి జింటా, లారాదత్త… తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోడలు, ప్రముఖ నటి జెనీలియా, భర్త రితేష్ దేశ్‌ముఖ్‌ సహా అమీర్‌ఖాన్, సంజయ్ దత్‌ సోదరి ప్రియాదత్, దియా మీర్జా,షారుక్, హృతిక్ రోషన్, దీపికా పదుకునే, రణ్వీర్, అనిల్ కపూర్, జాన్‌ అభ్రహం, ఐశ్వర్య, అభిషేక్ లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓటు హక్కు మన హక్కని దానిని ఉపయోగించుకుని సంవర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని కూడా ప్రభావితం చేస్తున్నారు. మహారాష్ట్రలో 288 , హర్యానాల్లో 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.