పోసాని పోతే… ఈమె డాన్స్ చేస్తుంది ఏంటి?

పోసాని కృష్ణ మురళి… టాలీవుడ్ లో మోస్ట్ ప్రోమోసింగ్ యాక్టర్ లో ఒకరు. అలాంటి ఆయన ఎప్పుడూ ఎదో ఒఅ సెన్సేషనల్ కామెంట్ చేస్తూ, అనిపించిన విషయం స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పే పోసాని కృష్ణ మురళి గారి డెడ్ బాడి ముందు ఒక హీరోయిన్ డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే, బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకోని రీసెంట్ గా ఆహాలో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి నందిని రాయ్.

ఈ సిరీస్ లో నందిని రాయ్ పోసాని కృష్ణమురళి భార్యగా కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన వెబ్ సిరీస్ లో పోసాని చచ్చిపోతాడు. ఆ సన్నివేశం షూట్ చేస్తున్నప్పుడు ఆఫ్ కెమెరాలో డాన్సులు ఇరగదీసింది నందిని రాయ్. ముందు పోసాని శవం ఉంటే గనుక ఆమె డాన్సులు చేయడం వైరల్ అవుతుంది. ఫన్ ఆన్ ది సెట్స్ అంటూ వీడియో పోస్ట్ చేసింది నందిని. ప్రస్తుతం ఇది చాలా వైరల్ అవుతుంది. కొందరు ఈ వీడియోను సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు ఎందుకు పెడతారు అంటూ నేరుగానే విమర్శిస్తున్నారు.