ఆ రాజు గారి గదిలోకి వెంకటేష్ ఎప్పుడు వస్తాడా?

తమిళ్ కి రాఘవ లారెన్స్ ఎలాగో తెలుగుకి ఓంకార్ అలా అయ్యాడు. ఒక పేరుతో వరసగా హారర్ కామెడీ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న ఓంకార్, రాజు గారి గది సిరీస్ లో మూడో సినిమాని రిలీజ్ చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజు గారి గది3 సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పెద్ద సినిమాలేవీ లేక పోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. అయితే ఏడాదికి ఒక రాజు గారి గది నుంచి సీక్వెల్ వస్తుందని ముందే అనౌన్స్ చేసిన ఓంకార్, త్వరలో రాజు గారి గది4కి ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టానున్నాడు.

venkatesh

ఈ సీక్వెల్ లో వెంకటేష్ నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిజానికి రాజు గారి గది2లో వెంకటేష్ నటించాల్సి ఉండగా, సీన్ లోకి నాగార్జున వచ్చి చేరాడు. ఎప్పటికైనా వెంకటేష్‌గారితో ఈ సిరీస్‌లో ఒక చిత్రం చేస్తానని ఓంకార్ ఇప్పటికే అనౌన్స్ చేశాడు కాబట్టి నెక్స్ట్ సినిమాలో వెంకటేష్ నటించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మరి సోలో హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తున్న వెంకటేష్, హారర్ కామెడీ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.