ఒక్క ఫైట్ కోసం 40 కోట్లా? శంకర్ ఏం చేయబోతున్నాడో…

కమల్ హాసన్, శంకర్… ఈ కాంబినేషన్‌ అంటే భారతీయుడు సినిమా గుర్తొస్తుంది. 23 ఏళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ తెరకెక్కుతున్న సినిమా ఇండియన్ 2. మొదట్లో బడ్జట్ ఇష్యూస్ ఫేస్ చేసిన చిత్ర యూనిట్, అవన్నీ క్లియర్ అయిపోవడంతో ఇప్పుడు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన శంకర్, లేటెస్ట్ షెడ్యూల్ ని నార్త్ ఇండియాలో షూట్ చేస్తున్నారు. ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40కోట్ల బడ్జెట్ పెడుతున్నారు అని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తెలియజేసాడు.

ప్రస్తుతం ఈ యాక్షన్ ఎపిసోడ్ భోపాల్ లో పీటర్ హెయిన్స్ పర్యవేక్షణలో హీరో కమల్‌పై తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇండియాన్2 గురించి మాట్లాడిన పీటర్ హెయిన్, సేనాపతి పాత్రకి 90ఏళ్ల వయసు ఉంటుంది. ఆ వయసున్న వ్యక్తికి ఫైట్స్ కంపోజ్ చేయడం చాలా కష్టంగా ఉందని, ఇండియన్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. భోపాల్ షెడ్యూల్ అయిన వెంటనే టీం అంతా మరో షెడ్యూల్ కోసం తైవాన్ మరియు యూరప్ వెళ్లి అక్కడ షూట్ చేయనున్నారు. ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.