సంతోష్ శోభన్ శకునాలన్నీ మంచిగానే ఉన్నాయి

ఏక్ మినీ కథ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో శోభన్ ఒకేసారి ఆరు సినిమాలని సైన్ చేసాడు. అయితే ఈరోజు సంతోష్ శోభన్ నెక్స్ట్ సినిమా గురించి వచ్చిన అనౌన్స్మెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎస్టాబ్లిష్డ్ అండ్ స్టార్ హీరో హీరోయిన్స్ తో సినిమాలు తీస్తున్న నందినీ రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రియాంక దత్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక పక్క ప్రభాస్ తో సినిమా చేస్తూ మరో పక్క జాతిరత్నాలు లాంటి లో బడ్జట్ సినిమాలు చేస్తూ హిట్స్ ఇస్తున్న ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తుంది అంటే అది ఆల్మోస్ట్ హిట్ అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అలాంటి ప్రొడక్షన్ హౌస్ అండ్ ఓహ్ బేబీతో హిట్ ఇచ్చిన నందినీ రెడ్డి ప్రాజెక్ట్ లో సంతోష్ శోభన్ నటిస్తున్నాడు అంటే అతనికి ఇకపై అన్నీ మంచి శకునములే ఉన్నట్లు ఉన్నాయి. అన్నట్లు ప్రాజెక్ట్ గురించి ఇన్ని డీటెయిల్స్ చెప్పి టైటిల్ చెప్పలేదు ఏంటి అనుకుంటున్నారా… టైటిల్ కూడా అన్నీ మంచి శకునములే. రాజేంద్ర ప్ర‌సాద్, రావు ర‌మేష్, న‌రేష్, వెన్నెల కిషోర్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించ‌నున్నారు.