ఒక్క అనౌన్స్మెంట్ తో రచ్చ లేపారు…

ఇండస్ట్రీలో హిట్ కి ఉండే వాల్యూ అండ్ రెస్పెక్ట్ వేరు. అందుకే హిట్ ఇచ్చిన కాంబినేషన్ ని మేకర్స్ అండ్ ఆడియన్స్ రిపీటేడ్ గా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబోల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వీళ్లు మళ్ళీ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారా అంటూ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం సిరీస్ తో ఇండియన్ సినీ అభిమానులందరినీ మెస్మరైజ్ చేసిన కాంబినేషన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అండ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ లది. 2013లో దృశ్యం మూవీతో మెప్పించిన ఈ కాంబో, ఈ ఏడాది దృశ్యం 2తో ముందు కన్నా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. క్రైమ్ ని ఇలా కూడా చెయ్యోచా? ఇంత గ్రిప్పింగ్ గా హోల్డ్ చెయ్యొచ్చా అని అందరూ అనుకునే స్థాయి హిట్ ఇచ్చారు. జార్జ్ కుట్టి అనగానే హీ ఈజ్ ఏ కోల్డ్ బ్లడెడ్ ఇంటెలిజెంట్ క్రిమినల్ అని దృశ్యం సినిమాలు చూసిన ప్రతి ఒక్కరూ చెప్తారు. ఈ కాంబినేషన్ నుంచి మరో మూడేళ్ళలో దృశ్యం 3 వస్తుందనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది. అభిమానులంతా ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, సడన్ గా ఔట్ ఆఫ్ ది బ్లూ ఈ ఇద్దరూ కలిసి 12th మ్యాన్ అనే సినిమాని అనౌన్స్ చేశారు. అదే ప్రొడక్షన్ హౌస్, జీతూ జోసెఫ్ డైరెక్టర్, మోహన్ లాల్ హీరో… ఈ ముగ్గురూ కలిసి Unveiling The Shadows అంటూ మళ్లీ వచ్చేశారు. ఊహించని ఈ అనౌన్స్మెంట్ కి అందరూ షాక్ అవుతున్నారు, అమీ అదే స్థాయిలో సినిమా కూడా షాక్ ఇస్తుందేమో చూద్దాం.