వినూత్న ప్రేమకథ… ‘వద్దురా సోదరా…’

కన్నడ యంగ్ హీరో రిషి తెలుగు తెరకి పరిచయం అవుతూ నటిస్తున్న సినిమా “వద్దురా సోదరా”. కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలోని వద్దురా సోదర, పెళ్లంటే నూరేళ్ల మంటరా అనే పాట నుంచి ఈ వద్దురా సోదరా టైటిల్ ని తీసుకున్నారు. తాజాగా వద్దురా సోదరా సినిమా ఫస్ట్ లుక్- మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.. ‘నా గర్ల్ ఫ్రెండ్ తనకు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను లేకుండా తను ఎప్పుడూ సంతోషంగా ఉండలేను అని చెప్పింది. అప్పటినుంచి నేను కూడా సంతోషంగా ఉండడం మానేసాను. కానీ ఇప్పుడు ఒక సంతోషపు ముసుకు వేసుకొని బ్రతుకుతున్నాను. పైకి సంతోషంగా ఉన్నా లోపల బాధతో మిగిలిపోయాను.. అని చెబుతూన్నా ఇంట్రడ్యూసింగ్ వీడియో సస్పెన్స్ తో ముగించారు మేకర్స్..’ ఇంటరెస్టింగ్ గా ఈ మోషన్ పోస్టర్ వద్దురా సోదరా సినిమాకి తెలుగులో కావల్సినంత ప్రమోషన్ అయితే చేసి పెట్టింది.

ఈ చిత్రానికి ఇస్లాహుదీన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రిషి సరసన ధన్య బాలకృష్ణన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని స్వేచ్ఛ క్రియేషన్స్, స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్ పతాకాలపై ధీరజ్ మొగిలినెని, సూర్య వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విష్ణు ప్రసాద్ దిలీప్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రసన్న శివరామన్ సంగీతం సమకూరుస్తున్నారు.