ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో సేతుపతి vs మనోజ్

మనోజ్ బాజ్ పాయ్, సమంత, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించిన ఫ్యామిలీ మ్యాన్ 2 ఎంతలా సక్సెస్ అయ్యిందో తెలిసిందే.. ఇప్పుడు ఫ్యామిలి మ్యాన్ సీజన్ 3 ని పట్టలెక్కించడానికి దర్శకద్వయం రాజ్ – డీకే లు సిద్దపడ్డారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 3 కి మరింత ఎట్రాక్ తీసుకురావడానికి ఇందులో విలన్ గా విజయ్ సేతుపతిని నటింప చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీని విజయ్ సేతుపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి ని సీజన్ 2 లోనే ఎల్టిటిఈ నాయకుడిగా తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఎల్టీటీఈ నాయకుడిగా నటించడానికి విజయ్ ఒప్పుకోలేదట.

ఇప్పటికే సీజన్ 2 పై తమిళ ప్రజలు వ్యతిరేకత తెలపడం తెలిసిందే.. ఒకవేళ విజయ్ గానీ ఆ పాత్ర చేసి వుంటే ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చి వుండేది. సీజన్ 2 ఎండ్ లోనే సీజన్ 3 గ్లిమ్ప్స్ చూపించిన రాజ్ డీకే… చైనా కరోన వైరస్ పై తెరకెక్కించబోతున్నారనే హింట్ ఇచ్చాడు. సీజన్ 3 లో విజయ్ విలన్ గా నటించడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. సేతుపతి లాంటి నటుడు మనోజ్ కి అపోజిట్ లో నటిస్తే స్క్రీన్ పై అద్భుతాన్నే చూడొచ్చు. ఇక ఈ మూడో సీజన్ లో మనోజ్ బాజ్‌పేయి-విజయ్ సేతుపతిల ఎపిక్ క్లాష్ ఈ సిరీస్‌కు పెద్ద ఆకర్షణగా మారడం ఖాయమని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని అభిమానించే ప్రేక్షకులు ఈ సీజన్ 3 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.