మొత్తానికి సినిమా రిలీజ్ అవుతుంది…

ఇండస్ట్రీలో హిట్ కి ఉండే వాల్యూ వేరు. హిట్ ఇస్తేనే ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది. ఒకప్పుడు ఏం చేశామని, ఎలాంటి సినిమాలు తీసామని కాదు ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నామా లేదా అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ బి.గోపాల్ గారే. హిట్స్, సూపర్ హిట్స్. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన ఆయన ఒక్కసారి ఫ్లాప్స్ లోకి వెళ్లిపోయారు. బి.గోపాల్ పైన ఈ ఫ్లాప్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడింది అంటే ఆయన గోపీచంద్, నయనతార లాంటి ఫాంలో ఉన్న వాళ్లతో సినిమా చేసిన రిలీజ్ కానంత. ఈ కాంబోలో ఆరడగుల బుల్లెట్ అనే సినిమా తెరకెక్కింది. చాలా సార్లు వాయిదా పడిన ఈ మూవీని గోపీచంద్ అభిమానులు కూడా మర్చిపోయి ఉంటారు. కారణాలు తెలియదు కానీ ఆరడగుల బుల్లెట్ మాత్రం ఏం అయ్యిందో ఎవరికీ తెలియదు. ఇటీవల ఓటిటి లో రిలీజ్ అంటూ వార్తలు వచ్చినప్పటికీ రిలీజ్ మాత్రం కాలేదు.. తాజాగా మరోసారి చిత్రయూనిట్ ఈ సినిమా రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చింది..

బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జయ బాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించారు. ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. కరోనా కారణంగా మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మరి ఈసారైనా ఆరడుగుల బుల్లెట్ రిలీజ్ కు నోచుకుంటుందో లేదో వేచి చూడాలి.