Allu Arjun Carvan: హీరో అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కి తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్

Allu Arjun Carvan: స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కార్వాన్‌కి పెను ప్రమాదం తప్పింది. అల్లు అర్జున్ కారవాన్‌ని లారీ ఢీకొట్టింది. ఆ కారవాన్ మీద అల్లు అర్జున్ లోగో ఉండటంతో.. స్థానికులు పరిగెత్తుకుంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లు అర్జున్‌కి ఏమైనా అయిందేమోనని ఆందోళన చెందారు. అయితే కార్వాన్‌లో అల్లు అర్జున్ లేడని తెలియడంతో.. ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. కార్వాన్‌లో ఐదగురు మేకప్ మెన్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

ALLU ARJUN CARVAN ACCIDENT

అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా.. ఖమ్మం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారవాన్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. వెనుక వస్తున్న లారీ ఢీకొట్టింది.