చిరుకు వైద్యారోగ్య అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్?

తనకు కరోనా సోకిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడంతో ఆయన కోలుకోవాలంటూ సినీ సెలబ్రెటీలు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారు. కరోనా సోకినట్లు చిరు ట్వీట్ చేసిన ముందురోజే సీఎం కేసీఆర్‌ను సినీ ప్రముఖులతో కలిసి ఆయన కలవడంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చిరు, నాగార్జునతో పాటు పలువురు సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించేందుకు ప్రగతిభవన్‌లో ముందురోజే సీఎం కేసీఆర్‌ను కలిశారు.

CHIRANJEVI

అయితే కొద్దిరోజుల తర్వాత తనకు కరోనా సోకలేదని, ఫస్ట్ రిపోర్ట్ తప్పంటూ చిరు మరో ట్వీట్ చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ కరోనా పాజిటివ్ వచ్చినవారు ఖచ్చితంగా రెండు వారాలు హోం క్వారంటైన్‌లో ఉండాలనే నిబంధన ఉంది. మధ్యలో నెగిటివ్ అని తేలినప్పటికీ ఖచ్చితంగా రెండువారాలు క్వారంటైన్‌లో ఉండాలి.

ఆ నిబంధనలను చిరంజీవి ఉల్లంఘించడంపై వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మండిపడుతున్నారు. సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన మీరే ఇలా చేస్తే ఎలా అంటూ చిరంజీవికి వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మెసేజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా నిబంధనలు పాటించి రెండు వారాలు హోం క్వారంటైన్‌లో ఉండాలని చిరుకు సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది.