17 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబో రిపీట్

విజయ్ తలపతి ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల దీపావళి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటివరకు 25 మిలియన్ వ్యూస్, 2.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. హీరో విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా కనిపించనున్నాడు.

VIJAY

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే తర్వాతి రెండు ప్రాజెక్టులు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. విజయ్ తన తర్వాతి సినిమాను దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో చేయనున్నాడని సమాచారం. దీని తర్వాత తమిళంలో ‘ఖుషి’ సినిమాను తెరకెక్కించిన ఎస్.జే సూర్యతో విజయ్ సినిమా చేయనున్నాడట.

విజయ్,జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన ఖుషీ సినిమా తర్వాత ఎస్‌.జే సూర్య, విజయ్ కలిసి ఇప్పటివరకు ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి పనిచేయనున్నారు.