Hansika: బ‌హుత్ మ‌జా ఆగ‌యా.. హ‌న్సిక ఆట పాట‌!

Hansika:బొద్దు గుమ్మ హ‌న్సికను త‌లుచుకోగానే బొద్దు అందాల‌తో క‌ళ్ల‌ముందుకు ఆమె అలా వ‌చ్చేస్తుంది. ఈ బొద్దు గుమ్మ త‌న అందాల‌తోనే తెలుగు, త‌మిళ్ ఇండ‌స్ట్రీల‌ను షేక్ చేసింది. త‌మిళ‌నాట అయితే Hansikaఆమెకు ఏకంగా గుడి క‌ట్టేశారు అభిమానులు. ప్ర‌స్తుతం హ‌న్సిక న‌టిస్తున్న తాజా చిత్రం మ‌హా. ఈ చిత్రం థ్రిల్ల‌ర్ నేప‌థ్యం కథాంశంతో తెర‌కెక్కుతుంది. ఇది హ‌న్సిక కెరీర్ 50వ చిత్రం.. ఈ చిత్రం త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. యు.ఆర్‌.జ‌మీల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Hansika mothwani

ఎట్సెటెరా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మ‌హా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై మాథి అజ‌గ‌న్ నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ శింబు ఓ కీల‌క‌పాత్ర‌ను పోషిస్తున్నారు. శింబు Hansikaహ‌న్సిక‌కు మాజీ ల‌వ‌ర్ అనే విష‌యం తెలిసిందే. 2019లో వీరి జంట‌గా చేసిన స‌న్నివేశాల‌ను పూర్తి చేయ‌గా.. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ సినిమా వాయిదా ప‌డింది. ఇక హ‌న్సిక ఓ పాప్ ఆల్బ‌మ్‌లో ఆడిపాడ‌బోతుంది. రేపు ఉద‌యం 11గంట‌ల‌కు ఈ ఆల్బ‌మ్ యూట్యూబ్ వేదిక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. గైరోన్ కి బాహోన్ మెయిన్ దేకా హై సోకే సాచ్ బ‌టాయిన్ బ‌డా.. మ‌జా ఆగ‌యా అంటూ Hansikaహ‌న్సిక ఈ పాప్ ఆల్బ‌మ్‌లో రెచ్చిపొతుంద‌ట‌.