BB3: బాల‌య్య షూటింగ్ ఆ.. అడ్డుకున్న స్థానికులు!

BB3: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో బీబీ3 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో బాల‌య్య‌కు జోడీగా ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. BB3ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ మండ‌లం కొటాల‌గూడెంకు చిత్రబృందం వెళ్లింది. ఈ క్ర‌మంలో అక్క‌డి స్థానికులు షూటింగ్‌ను అడ్డుకున్నారు.

bb3

ఈ స్థ‌లంలో షూటింగ్ కార‌ణంగా త‌మ పంట పొలాలు నాశ‌న‌మ‌వుతున్నాయ‌ని.. అందువ‌ల్ల ఇక్క‌డ షూటింగ్ చేయ‌వ‌ద్ద‌ని కోరారు. ఇక BB3చిత్ర‌బృందం చేసేది ఏమీలేక వేరే లొకేష‌న్ కోసం వెతుకుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తుండ‌గా.. ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈBB3 చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. ఇక ఈ చిత్రానికి గాడ్‌ఫాద‌ర్ అనే టైటిల్‌ను చిత్ర‌బృందం ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం.