ప్రభాస్ కి టాటా… విజయ్ కి హాయ్…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూజా హెగ్డే పని పూర్తయింది. దీంతో బుట్టబొమ్మ బై చెప్పేసి చెన్నై వెళ్లిపోయింది. అక్కడ పూజ, దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించనుంది. పూజ హెగ్డే తమిళ్ లో నటిస్తున్న మొదటి భారి సినిమా ఇదే. ఇదిలా ఉంటే ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఇటలీ నేపథ్యంలో పునర్జన్మల నేపధ్యంలో వచ్చే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని నిర్ణయించారు.

ఇటీవలే రిషూట్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా మొదలైంది. ముందుగా పూజ హెగ్డేకి సంబంధించిన కొన్ని సీన్స్ ను చిత్రీకరించారు. ఇక్కడితో రాధ్యే శ్యామ్ లో పూజ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ప్రభాస్ పై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇది కూడా అయిపోతే రాధ్యే శ్యామ్ మూవీకి గుమ్మడి కాయకొట్టినట్లేనట.