Aamir Khan-Kiran Rao: విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌

Aamir Khan-Kiran Rao: విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్‌ ఆమిర్‌ఖాన్‌: బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌రావు విడిపోతున్నారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు.

‘మా ఈ 15 సంవత్సరాల వైవాహిక బంధం జీవిత కాలానికి సరిపడా ఎన్నో చిరునవ్వులు, ఆనందాలు, సంతోషాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతో మా బంధం మరింత బలపడింది. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులుగా ఉండాలనుకుంటున్నాం. ఎంతోకాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం. విడాకులు తీసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని ఆరంభించడానికి ఇదే సరైన సమయంగా మేము భావిస్తున్నాం. మా కుమారుడు ఆజాద్‌కి తల్లిదండ్రులుగా ఉంటూ అతని బరువు, బాధ్యతలు ఉమ్మడిగా చూసుకుంటాం. అలాగే, పానీ ఫౌండేషన్‌, ఇతర వృత్తిపరమైన విషయాల్లో మేమిద్దరం కలిసే పనిచేస్తాం. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మాకు ఎంతగానో సపోర్ట్‌ చేసిన కుటుంబసభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. మా వైవాహిక బంధానికి ముగింపులా మీరు ఈ విడాకులను చూడకండి. ఇది కేవలం కొత్త ప్రయాణానికి నాంది మాత్రమే అనుకోండి’ అని ఆమిర్‌, కిరణ్‌రావు ప్రకటించారు.