ఫిలిం ఛాంబర్ స్వరుచి రెస్టారెంట్లో అగ్నిప్రమాదం

ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల సమయానికి ఫిలింనగర్ లోని ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్ లో ఉన్నటువంటి స్వరూచి రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మొదటిగా భవనం పైన భాగంలో మొదలయ్యి భవనం కింద వరకు ఆ మంటలు వ్యాపించాయి. భవనం పైన వస్తున్న ఆ పొగను గ్రహించిన ఫిల్మ్ చాంబర్ ఉద్యోగులు వెంటనే దగ్గరలోని అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి చురుకుగా వ్యవహరించారు. చాంబర్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ గారు వెంటనే అందరిని అలర్ట్ చేసి ఎవరికి ఏ ప్రమాదం కాకుండా చూసుకున్నారు. అయితే అదే సమయంలో మరికొందరు ప్రముఖ ప్రత్యక్షతలు చాంబర్లో ఉన్నారు. అందరూ వెంటనే చురుకుగా వ్యవహరించడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ మంటలను అదుపు చేశారు.