తేజ సజ్జ నెక్స్ట్ సినిమా దర్శకత్వంలో వస్తుందో తెలుసా?

హనుమాన్ చిత్రం తో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తేజ సజ్జ కు ఆ సినిమా తరువాత విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలను మించి హిట్ కొట్టడంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు అనే చెప్పొచ్చు. అయితే హనుమాన్ సినిమా తరువాత తేజ సజ్జ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ఓ ప్రశ్న బాగా వినిపిస్తుంది. ఈ సమయంలోనే ఓ అదిరిపోయే వార్త మన ముందుకి వచ్చింది. ఈగల్ సినిమాతో హిట్ కొట్టిన కార్తీక్ ఘట్టమనేనితో ఇప్పుడు తేజ సజ్జ సినిమా తీయబోతున్నట్లు తెలిసింది. అశోక వనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న సినిమాలలో నటించిన రితిక నాయక్ ఈ సినిమాలో కథ నాయకిగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.