మహేశ్ లో మార్పుకి ఆరేళ్లు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, బాక్సాఫీస్ కింగ్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ సూపర్ ఫామ్ లో కంటిన్యూ చేస్తున్న హీరో. శ్రీమంతుడితో మొదలుపెడితే, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు… గత అయిదేళ్లలో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి మహేశ్ వసూళ్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న మహేశ్ మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. హిట్స్ కొట్టడం మహేశ్ కి కొత్త కాదు కానీ ఒక్క సినిమా మహేశ్ ని మార్చిందంటే నమ్మగలరా… అవును మహేశ్ బాబు స్టోరీ డెసిషన్ ని మార్చిన ఒకేఒక్క సినిమా ఆగడు. దూకుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మహేష్ శ్రీనువైట్ల కలిసి సినిమా చేస్తున్నారు అనగానే ఆగడుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అనౌన్స్మెంట్ నుంచే బజ్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, టీజర్ ట్రైలర్ తో అంచనాలకి ఆకాశమే హద్దు అనిపించేలా చేశారు. మహేశ్ డైలాగ్స్, యాక్టింగ్, తమన్నా గ్లామర్, అతడు తర్వాత ఆ రేంజ్ టైటిల్ సాంగ్… ఇవన్నీ కలిసి ఆగడు సినిమాకి ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ బజ్ క్రియేట్ చేశాయి. అనుకున్నట్లు గానే సరిగ్గా అయిదేళ్ల క్రితం ఇదే రోజున ఆగడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఆగడు, సెకండ్ డే నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఆగడు రిజల్ట్ మహేశ్ స్టోరీ సెలక్షన్ ని కూడా క్వేషన్ చేసేలా చేసింది. ఆ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న మహేశ్, వరస బెట్టి హిట్స్ ఇస్తూ రికార్డులు చెరపడానికి మన దెగ్గర బేరాలు లేవమ్మా అనే రేంజులో బాక్సాఫీస్ ని కుమ్మేస్తున్నాడు. ఆగడు రిజల్ట్ మహేశ్ లో తెచ్చిన మార్పు అయిదేళ్లు అయినా కంటిన్యూ అవుతూనే ఉంది. మహేశ్ మరిన్ని హిట్స్ అందుకోవాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.