గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరపై మెరిసి, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ మనసులని కొల్లగొట్టిన కన్నడ బ్యూటీ నభ నటేష్. పూరి-రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందినిగా యాక్ట్ చేసి తన గ్లామర్ తో అందరినీ ఫిదా చేసిన నభ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఎదో ఒక ఫోటోషూట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ ఉండే నభ నటేష్ లేటెస్ట్ ఫొటోస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. తన మ్యాజిక్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్న నభ ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ కి పోటీగా స్ట్రాంగ్ గ్లామర్ స్టేట్మెంట్ ఇచ్చింది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ ఇస్మార్ట్ బ్యూటీ, నితిన్ నటిస్తున్న సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యింది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదున్ రీమేక్ లో నభ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఈరోజే అనౌన్స్ చేసింది. హిందీలో రాధికా ఆప్టే నటించిన పాత్రలో నభ కనిపించనుంది. ఒకపక్క సినిమా అనౌన్స్మెంట్, మరోపక్క ఫొటోస్ తో నభ నటేష్ ఈరోజు ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇచ్చింది.