నీ డెడికేషన్ కి సలాం బాబా

బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజు బాబా ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి దుబాయ్ లోని తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్లాడు. ఈ విషయాన్ని స్వయంగా షేర్ చేసుకున్న మాన్యత, పిల్లలతో పాటు సంజూ ఉన్న ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. బ్రీథింగ్ ఇష్యూతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంజయ్ దత్ కి లంగ్ కాన్సర్ 4వ స్టేజ్ లో ఉందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ఒకతను బయట పెట్టాడు కానీ ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

సంజయ్ దత్ ఫ్యామిలీ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోయినా సంజయ్ దత్ కి క్యాన్సర్ ఉందనే విషయం మాత్రం నిజమే అయ్యి ఉండొచ్చని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం ట్రీట్మెంట్ కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్న సంజయ్, మళ్లీ సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న పృథ్వి రాజ్ సినిమాలో సంజయ్ దత్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన సంజు, బాలన్స్ ఉన్న 6 రోజుల షూటింగ్ ని కూడా దీపావళి తర్వాత కంప్లీట్ చేయడానికి సిద్దమయ్యాడు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న పృథ్వి రాజ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. సంజూకి క్యాన్సర్ ఉంది కాబట్టే వీలైనంత త్వరగా తనకి ఉన్న కమిట్మెంట్స్ ని కంప్లీట్ చేస్తున్నాడని సమాచారం. నిజానికి సంజయ్ దత్ ఇలా కమిట్మెంట్స్ ని ఫుల్ ఫిల్ చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో తను జైలుకి వెళ్లిన టైములో కూడా సంజయ్ సైన్ చేసిన ప్రతి సినిమాని కంప్లీట్ చేశాడు. వర్క్ పట్ల తనకున్న డెడికేషన్ కి ఇదో పెద్ద ఉదాహరణ అనే చెప్పాలి. సంజయ్ దత్ షూటింగ్ రెడీ అవుతున్నాడు కాబట్టి పృథ్విరాజ్ మేకర్స్ కూడా చిత్రీకరణ మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు.