మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన ఫిలిం ఫెడరేషన్…

మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా చేస్తున్న సేవల గురించి అందరికీ తెలిసిందే. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి ఇటీవలే కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది.ఈ సందర్భంగా ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసి, వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో ఎవరికి ఆలోచన రాకముందే మీరు వాక్సినేషన్ చేయిస్తానని ప్రకటించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అనేక సంస్థలతో ప్రయత్నించి, చివరికి అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక దన్యవాదాలు…

సి సి సి కమిటీ వారికి, సి సి సిలో భాగస్వమ్యులైన దాతలందరికి మా మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్స్ ఎప్పుడు మీ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాయి, ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాకుండాలని కోరుకుంటూ మీ సినీ కార్మికులు… ధన్యవాదాలతో…అనిల్ కుమార్ వల్లభనేని అధ్యక్షులు. పి ఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శి.