ముదురుతున్న స్టార్ హీరోల ఫ్యాన్ వార్…

తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఫ్యాన్ వార్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ జబ్బు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పాకింది. ఇప్పటి వరకూ కాస్త సైలెంట్ గా ఉండే ఇండస్ట్రీలో ఇప్పుడు అభిమానుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ లో ఇప్పుడు హీరోలు కూడా ఇన్వాల్వ్ కావడం విచారం. అసలు విషయానికి వస్తే… సుదీప్‌ నటించిన పైల్వాన్‌ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని మరో స్టార్ హీరో దర్శన్‌ ఫ్యాన్స్ పైరసీ చేసి పైల్వాన్ సినిమాను థియేటర్స్ లో ఆడకుండా చేస్తున్నారని సుదీప్‌ అభిమానులు, దర్శన్‌ అభిమానులపైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓపెన్ అయిన దర్శన్, తన ఫ్యాన్స్ ని ఎవరైనా ఏమైనా అంటే ఒప్పుకోనని స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ట్వీట్ చేశాడు. దర్శన్‌ ట్వీట్‌ను చూసిన సుదీప్‌ అభిమానులు కూడా ఎక్కడ తగ్గకుండా సమాధానం ఇచ్చారు. దర్శన్‌, మీరు మీ అభిమానులను అన్నదాతలు, సెలబ్రెటీలు అని పిలిస్తున్నారు. ఇది మాకు చాలా సంతోషం, ఈ విషయంలో అభిమానులుగా తాము కూడా చాలా గర్వపడుతున్నాము. అయితే మీ అభిమానులు వేరే వాళ్ల అన్నం గుంజుకొని తింటున్నారు. మేము ఎవరి అన్నం లాక్కోలేదు. ఎవరి గురించి చులకనగా మాట్లాడలేదు. ఒక నటుడి సినిమాను డీప్రమోట్‌ చేయడం ఎంత వరకుసమంజసం, ఈ విషయం మీ అభిమానులకు తెలియదా? మీ సినిమా విడుదల అయిన సమయంలో మేము కూడా ఇలా మీ సినిమాను డీప్రమోట్‌ చేస్తే మీకు బాధ కలగదా, అనిపించదా మీకో న్యాయం మాకో న్యాయమా చెప్పండి అంటు సోషల్‌ మీడియాలోనే సుదీప్‌ అభిమానులు పోస్టు చేశారు. దీంతో ఇద్దరి హీరోలు, అభిమానుల మధ్య సోషల్‌ వార్‌ వేడి వేడిగా జరుగుతోంది.