తమిళ సినిమాకి లండన్ లో డబ్బింగ్…

ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేసిన కాంబో ధనుష్-వెట్రిమారన్. చివరగా ‘వడచెన్నై’ మూవీతో హిట్ అందుకున్న ధనుష్‌, వెట్రిమారన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో చిత్రం ‘అసురన్‌’. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రా అండ్ రగ్గడ్ గా ఉండి సినీ అభిమానులని ఆకట్టుకుంది. కలైపులి ఎస్‌ థాను ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాష్‌ సంగీతం సమకూర్చారు. అక్టోబర్‌ 4వ తేదీన విడుదలకానున్న ఈ చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ధనుష్‌కు సంబంధించిన డబ్బింగ్‌ పనులు మాత్రం మిగిలివున్నాయి. ప్రస్తుతం ధనుష్‌ తన 40వ చిత్రపనుల్లో లండన్‌లో బిజీగా వున్నారు. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ ఎక్కువభాగం లండన్‌లో జరగనుంది. ఈ కారణంగా ‘అసురన్‌’ చిత్రంలోని ధనుష్‌ చెప్పాలిసిన డబ్బింగ్‌ పనులు లండన్‌లో జరపాలని చిత్రయూనిట్‌ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ డబ్బింగ్‌ పనులు లండన్‌లో నిర్వహించేందుకు ప్లాన్‌ చేశారు.