కమాన్ స్టార్ట్ ది కెమెరా ఐ సే…

ఇస్మార్ట్ హీరో, ఎనర్జీటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి జోష్ మీద ఉన్నాడు. అదే హ్యాపీ మూడ్ ని కంటిన్యు చేస్తూ తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిన ఈ ప్రాజెక్ట్ గురించి రామ్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ బైలింగ్వల్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమా గురించి రామ్‌ ఓ అప్‌డేట్‌ను ఇచ్చాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రామ్ పోతినేని ఈ ప్రాజెక్ట్ గురించి ట్వీట్‌ చేస్తూ.. ‘చివరి కథనం పూర్తెయింది.కథ సూపర్ డూపర్‌ కిక్‌ ఇచ్చింది. లవ్‌ యూ లింగుస్వామి సార్‌. రోల్ దట్ కెమెరా ఐ సే’ అని కోట్ చేశాడు.

పూర్తి కథ విన్న తర్వాత రామ్‌ పోతినేని వేసిన ట్వీట్‌ లోని జోష్ అండ్ ఎక్జైట్‌మెంట్‌ చూస్తుంటే ఈ మూవీ ఓ రేంజ్‌లో ఉండబోందని అర్థమవుతుంది. అయితే పూర్తి స్క్రీప్ట్‌ వినకుండానే రామ్ ఈ సినిమాని కాంబినేషన్ కోసం ఫైనల్ చేశాడా అనే డౌట్ వస్తోంది. యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.