సమంతకు పోటీగా మరో హీరోయిన్

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం పేరుతో ఒక పౌరాణిక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయతే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బాకు అవకాశం దొరికిందట. ఇందులో ఈషారెబ్బా కీలక పాత్రలో నటించనుందని సమాచారం. అయితే ఈషారెబ్బా పాత్ర ఏంటనేది ఇంకా తెలియలేదు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

eesha rebba in sankuntalam

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించనుండగా.. స్వయంగా తన సొంత బ్యానర్ అయిన గుణ టీమ్ వర్క్స్‌పై ఈ సినిమాను గుణశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ మ్యూజిక్ అందించనున్నాడు.

కాగా ఈషారెబ్బా గతంలో అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు ఇంకా సరైన పేరు కాలేదు. మరి శాకుంతలం సినిమాతో అయినా ఈషారెబ్బా హిట్ అందుకుంటుందో.. లేదో.. చూడాలి