Tollywood: అతిగా ప్రేమించ‌డం కూడా హానిక‌ర‌మే: ఈరోజుల్లో హీరో శ్రీ మంగం

Tollywood: ఈ రోజుల్లో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫ‌స్ట్ సినిమాతోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నాడు శ్రీ మంగం. ఇక కొంత గ్యాప్ త‌ర్వాత ప్ర‌ణ‌వం లాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ , టైటిల్ తో వ‌స్తున్నాడు. చరిత‌ అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా కుమార్. జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. త‌ను. ఎస్ నిర్మాత‌. ఈ చిత్రం ఈ నెల 5న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా Tollywood హీరో శ్రీ మంగం మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

sri mangam pranavam

Tollywood నా తొలి సినిమాల్లో కాలేజ్ గోయింగ్, బాయ్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లు చేశాను. కానీ ఈ సినిమా అలా కాదు . చాలా మెచ్యూర్డ్ లుక్‌తో మ్యారిడ్ క‌పుల్ గా న‌టిస్తున్నాను. నాలో కానీ , బాడీ లాంగ్వేజ్ లో కానీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయి. నా క్యార‌క్ట‌ర్ తో పాటు సినిమా కంటెంట్ కూడా న‌చ్చ‌డంతో ప్ర‌ణ‌వం సినిమా చేశాను. క‌చ్చితంగా నాకు ఈ సినిమా ప్ల‌స్ అవుతుంద‌ని న‌మ్ముతున్నా. అలాగే ప్ర‌ణవం క‌థ గురించి చెబుతూ.. భ‌గ‌వంతుడు మ‌న‌కు ఎన్నో వ‌రాలు ఇచ్చాడు. ఆడ‌వాళ్లు కూడా అందులో ఒక‌టి. అటువంటి ఆడ‌వారికి హాని త‌ల‌పెట్ట‌కుండా చూసుకున్నంత కాలం మ‌న జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే వారికి హాని త‌ల‌పెట్టాల‌ని భావిస్తామో మ‌నంద‌రి జీవితాలు చిన్నాభిన్న‌మ‌వుతాయి అనేది మా చిత్రంలో చూపించాం. ఆడ‌వారిని ప్ర‌కృతితో పోలుస్తాం కాబ‌ట్టి… ‌ఒక్క ముక్క‌లో చెప్పాలంటే … ఎప్పుడైతే మ‌నం ప్ర‌కృతికి మ‌నం హాని త‌ల‌పెడ‌తామో అప్పుడు ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌విస్తుంటాయి… అలాంటిదే మా సినిమా క‌ధాశం అని చెప్ప‌వ‌చ్చు. Tollywood ఈ సినిమాలో నేను‌ ప్లే బాయ్ పాత్ర‌లో న‌టించాను. ఒక అమ్మాయి న‌న్ను అతిగా ప్రేమించ‌డం వ‌ల‌న నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనేది నా పాత్ర‌. కొన్ని కొన్ని సార్లు సిట్యుయేష‌న్స్ ని బ‌ట్టి నా పాత్ర నెగిటివ్ గా కూడా అనిపిస్తుంది. అది ఎలా అన్న‌ది మాత్రం మీరు తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా మా డైర‌క్ట‌ర్ చెప్పిన స్ర్కీన్ ప్లే నాకు బాగా న‌చ్చింది. ఎందుకంటే ఇది చాలా డెలికేట్ పాయింట్. డెలికేట్ పాయింట్ ని డీల్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ విష‌యంలో మా డైర‌క్ట‌ర్ స‌క్సెస్ అయ్యారని చెప్ప‌వ‌చ్చు. త‌న‌కిది తొలి సినిమా అయినా ఎక్క‌డా ఆ ఫీలింగ్ ఉండ‌దు. ఎంతో ఎక్స్ పీరియ‌న్స్ డ్ డైర‌క్ట‌ర్ లా సినిమా తీశారు. ప్ర‌తి విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. అలాగే మా Tollywood నిర్మాత త‌ను గారూ కూడా నిర్మాత‌లా కాకుండా ఒక వ‌ర్కర్ లా ఈ సినిమా కోసం శ్ర‌మించారు. సినిమా అంటే మా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు విప‌రీత‌మైన ప్యాష‌న్. వీరిద్ద‌రికీ ఈ సినిమా స‌క్సెస్ సాధించి మ‌రెన్నో సినిమాలు నిర్మించే అవ‌కాశం మా ప్ర‌ణవం చిత్రం ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఖ‌‌చ్చితంగా ఈ సినిమాతో ప‌ది సినిమాలు వ‌స్తాయన్న న‌మ్మ‌కం ఉంది. Tollywood హీరోగా కాక‌పోయినా విల‌న్ గా అయినా అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. ఎందుకంటే ప్ర‌ణవంలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాను కాబ‌ట్టి. కథ‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఏ క్యార‌క్ట‌ర్ అయినా నేను చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని శ్రీ‌మంగం పేర్కొన్నాడు. ఇక Tollywood ఈ చిత్రానికి పద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించ‌గా.. ఇందులో ఆర్‌పి ప‌ట్నాయ‌క్‌, ఉషా ఓ పాటను ఆల‌పించారు.